
జెరుసలేం: ఇజ్రాయెల్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పాలస్తీనాకు చెందిన ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. జెరుసలేం శివారులోని వెస్ట్‌బ్యాంక్‌లో ఈ విషాదం చోటుకేసుకుంది. మృతులు సెక్యూరిటీ గార్డులని సమాచారం. ఈ విషయాన్ని జెరుసలేం అధికారులు వెల్లడించారు. స్థానిక వెస్ట్‌బ్యాంక్‌లోని సెటిల్మెంట్ ప్రదేశంలోకి ఓ సాయుధుడు ప్రవేశించాడు. అక్కడ తనకు కనిపించిన భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి.. పరారయ్యేందుకు యత్నించాడు. సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు గాయపడ్డట్లు తెలుస్తోంది. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది చనిపోగా, మరికొందరు గాయపడ్డారు.