
స్వతంత్ర పాలస్తీనాకు మద్దతు
శాంతికోసం పాలస్తీనా అనుసరి స్తున్న విధానానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌తో మోదీ
- ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు
న్యూఢిల్లీ: శాంతికోసం పాలస్తీనా అనుసరి స్తున్న విధానానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయన పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడుతూ ఇజ్రాయెల్‌తో శాంతియుత సహజీవనం సాగిస్తూనే సార్వభౌమాధికారం, స్వాతం త్య్రం కలిగిన ఐక్య పాలస్తీనాను చూడాలని భారత్ ఆకాంక్షిస్తుందన్నారు. జూలైలో ఇజ్రా యెల్ పర్యటనకు వెళ్లనున్న మోదీ పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య సమగ్ర పరిష్కా రాన్ని కనుగొనే దిశగా చర్చలు జరిపారు.
సుదీర్ఘ చర్చల అనంతరం వీసా మినహా యింపులు, వ్యవసాయ రంగం, ఆరోగ్యం, క్రీడలు తదితర అంశాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా అబ్బాస్‌తో కలసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పాలస్తీనాకు మద్దతు విషయంలో దృఢంగా ఉన్నామని వెల్లడిం చారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య చర్చల ప్రక్రియ కొనసాగాలని ఆశిస్తున్నామన్నారు. పాలస్తీనా అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు పరస్పర సహకారం పెరిగేందుకు తోడ్పడతాయన్నారు.
భారత్ సంఘీభావం ప్రశంసనీయం
పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ మాట్లాడుతూ ‘మాకు భారత్ సంఘీభావం తెలపడం ప్రశం సనీయం. భారత్ మాకు ఎన్నో ఏళ్ల నుంచి స్నేహం ఉంది. అంతర్జాతీయంగా పలుకు బడి కలిగిన భారత్ పాలస్తీనా–ఇజ్రాయెల్ వివాద పరిష్కారంలో ముఖ్య పాత్ర పోషించ గలదు. నేను ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా సమావేశమయ్యాను. మా రెండు దేశాల వివాద పరిష్కారానికి గల అవకాశాల గురించి చర్చించాను’ అని తెలిపారు.