జెనీవా: ఈ ఏడాది ద్వితీయార్థంలో మరోసారి కోవిడ్–19 విజృంభిస్తే ప్రపంచవ్యాప్తంగా11.9 శాతం పనిగంటలను కోల్పోవాల్సి వస్తుందని, ఇది 34 కోట్ల ఫుల్‌టైమ్ ఉద్యోగాలు కోల్పోవడానికి సమానమని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది. దీని నుంచి అంతర్జాతీయ శ్రామిక మార్కెట్ ఈ యేడాదిలో కోలుకోవడం అనిశ్చితితో కూడుకున్నదని ‘ఐఎల్‌ఓ మానిటర్: కోవిడ్–19 అండ్ ద వరల్డ్ ఆఫ్ వర్క్’ ఐదవ ఎడిషన్ వెల్లడించింది. 2020 ద్వితీయ త్రైమాసికంలో అంతర్జాతీయంగా 14 శాతం పనిగంటలు తగ్గాయని, ఇది 40 కోట్లు ఉద్యోగాలు కోల్పోవడంతో సమానమని ఐఎల్‌ఓ నివేదిక తెలిపింది. (అగ్రరాజ్యంలో కరోనా కల్లోలం..ఒక్కరోజే 50 వేల కేసులు)
గతంలో అంచనా వేసిన దానికంటే ఈ ఏడాది ప్రథమార్థంలో కోల్పోయిన పనిగంటలు తీవ్రస్థాయిలో ఉన్నట్టు వెల్లడయ్యింది. కోవిడ్ మహమ్మారి ప్రభావం మహిళలపై తీవ్రంగా ఉన్నదని, గత కొన్ని దశాబ్దాల్లో స్త్రీపురుష అసమానతలను ఛేదించడంలో సాధించిన ప్రగతిని సైతం కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వెలిబుచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ప్రభావితమైన నాలుగు రంగాల్లో, 36.6 శాతం మంది పురుషులు పనిచేస్తోంటే, మహిళలు 40శాతం(51 కోట్ల) మంది పనిచేస్తున్నారని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment