జెనీవా: రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజల వలసలు వేగంగా పెరుగుతున్నాయని ఐరాస వలస విభాగం తెలిపింది. శనివారం అంచనా ప్రకారం కనీసం 1.50 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ వీడి పోగా ఆదివారానికి ఈ సంఖ్య 3.68 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది. వీరంతా పోలండ్, హంగరీ, రొమేనియా తదితర దేశాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది.
ఉక్రెయిన్ వీడి వచ్చే వారితో పోలండ్ సరిహద్దుల్లో 14 కిలోమీటర్ల పొడవైన కార్ల క్యూ ఉందని వలస విభాగం ప్రతినిధి క్రిస్ మీజర్ ట్విట్టర్‌లో తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారన్నారు. ఎముకలు కొరికే చలిలో వీరు రాత్రంతా కార్లలోనే జాగారం చేశారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment