
భారత్ బయలుదేరిన సుష్మా
పొక్రా : నేపాల్లో మూడురోజుల పర్యటన ముగించుకుని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ శుక్రవారం భారత్ బయలుదేరారు. ఆమె ఎమ్ఐ17 చాపర్లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకుంటారు. నేపాల్ వేదికగా జరిగిన 37వ సార్క్ మంత్రులు సమావేశంలో సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. అందులోభాగంగా సార్క్ దేశాల విదేశాంగా మంత్రులతో సుష్మా సమావేశమై... ఆయా దేశాల ద్వేపాక్షిక సంబంధాలపై వారితో చర్చలు జరిపారు.
ఆ క్రమంలో గురువారం పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో సుష్మా భేటీ అయి.. పఠాన్కోటపై జరిగిన ఉగ్రదాడిపై వారు చర్చించారు. పాక్ ఉన్నతాధికారుల దర్యాప్తు బృందం మార్చి 27వ తేదీన పఠాన్కోట రానున్నారని ఈ సందర్భంగా పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడించినట్లు సుష్మా వెల్లడించిన సంగతి తెలిసిందే.