విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు @ రూ.15,003 కోట్లు.. | Foreign investors investments @ Rs .15,003 crores | Sakshi
Sakshi News home page

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు @ రూ.15,003 కోట్లు..

Published Mon, Jul 25 2016 1:55 AM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు @ రూ.15,003 కోట్లు.. - Sakshi

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు @ రూ.15,003 కోట్లు..

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) జోరు కొనసాగుతోంది. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 15,003 కోట్లు (220 కోట్ల డాలర్ల) పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల 22 వరకూ స్టాక్ మార్కెట్లో రూ.8,086 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.6,917 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టారు. జీఎస్‌టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందగలదని, కంపెనీల క్యూ1 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు  ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులంటున్నారు. ఇంతకు ముందటి రెండు నెలల్లో(మే-జూన్)లలో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.4,373 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement