న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ కమిషన్ యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ తాజా నివేదికపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది పూర్తిగా హానికరమైన.. ప్రేరేపితమైన నివేదికగా పేర్కొంటూ భారత విదేశాంగ శాఖ స్పందించింది.
‘యూఎస్‌సీఐఆర్‌ఎఫ్’ రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత సంస్థ. వాస్తవాలను తప్పుగా సూచిస్తోంది. భారత్‌పై ప్రేరేపిత కథనాలను కొనసాగిస్తోంది అని నివేదికపై ఎదురైన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ బదులిచ్చారు.
‘అంతర్జాతీయ మతస్వేచ్ఛపై ఈ యూఎస్ కమిషన్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. అందులో.. మత స్వేచ్ఛ విషయంలో భారత్ క్రమబద్ధమైన ఉల్లంఘనలు చేస్తోందని పేర్కొంటూ కొలంబియాకు చెందిన విశ్లేషకురాలు సేమా హసన్ ఈ నివేదికను రూపొందించారు. అయితే..
‘యూఎస్‌సీఐఆర్‌ఎఫ్’ నివేదికను.. భారత్ ఖండించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఇలాంటి వార్షిక నివేదికలను తోసిపుచ్చుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment