USCIRF
-
అది రాజకీయ ప్రేరేపిత నివేదిక: భారత్
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ కమిషన్ యూఎస్సీఐఆర్ఎఫ్ తాజా నివేదికపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది పూర్తిగా హానికరమైన.. ప్రేరేపితమైన నివేదికగా పేర్కొంటూ భారత విదేశాంగ శాఖ స్పందించింది.‘యూఎస్సీఐఆర్ఎఫ్’ రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత సంస్థ. వాస్తవాలను తప్పుగా సూచిస్తోంది. భారత్‌పై ప్రేరేపిత కథనాలను కొనసాగిస్తోంది అని నివేదికపై ఎదురైన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ బదులిచ్చారు.‘అంతర్జాతీయ మతస్వేచ్ఛపై ఈ యూఎస్ కమిషన్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. అందులో.. మత స్వేచ్ఛ విషయంలో భారత్ క్రమబద్ధమైన ఉల్లంఘనలు చేస్తోందని పేర్కొంటూ కొలంబియాకు చెందిన విశ్లేషకురాలు సేమా హసన్ ఈ నివేదికను రూపొందించారు. అయితే..‘యూఎస్సీఐఆర్ఎఫ్’ నివేదికను.. భారత్ ఖండించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఇలాంటి వార్షిక నివేదికలను తోసిపుచ్చుతూ వస్తోంది. -
ఇక దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. ఈ జాబితా రూపకల్పనలో మతపరమైన వివక్షలు ఉండవన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అమిత్ మాట్లాడారు. ‘అస్సాం తరహాలో జాతీయ పౌర రిజిస్టర్‌ను దేశవ్యాప్తంగా తీసుకువస్తాం. ఏ మతం వారూ భయపడాల్సిన పని లేదు. ఎన్ఆర్సీ గొడుగు కిందకి అందరినీ తీసుకురావడమే దీని ఉద్దేశం. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగుతుంది’ అని అన్నారు. ‘ఏ మతానికి చెందిన వారైనా భారతీయ పౌరులందరికీ ఈ జాబితాలో స్థానం లభిస్తుంది. ఈ అంశంలో ఎలాంటి వివక్షలకు తావు లేదు’ అని అమిత్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ రిజిస్టర్‌ను రూపొందిస్తే అస్సాంను అందులో కలుపుతామన్నారు. ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ బిల్లు వేర్వేరు జాతీయ పౌర రిజిస్టర్‌కు, పౌరసత్వ సవరణ బిల్లుకు మధ్య తేడా ఉందన్నారు. హిందువులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టయన్లు, సిక్కులు, పార్సీలు ఎవరైనా కానివ్వండి ఆశ్రయం కోరి వచ్చిన వారిని భారత్ అక్కున చేర్చుకుంటుందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌లలో మతపరమైన అరాచకాలను భరించలేక భారత్‌కు శరణార్థులుగా వచ్చినవారికి జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు కింద పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేశారు. జాతీయ పౌరసత్వ బిల్లుని లోక్‌సభ ఆమోదించిందని, సెలెక్ట్ కమిటీ ఆమోదించాక సభ రద్దయిందని, త్వరలో ఈ బిల్లు మళ్లీ సభ ముందుకు వస్తుందని వివరించారు. పౌరసత్వ సవరణ బిల్లుకి, జాతీయ పౌర రిజిస్టర్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. బెంగాల్లో అనుమతించం: మమత దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్‌ను తయారు చేస్తామన్న కేంద్రం ప్రకటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మండిపడ్డారు. ‘ నేను అధికారంలో ఉన్నంత వరకు ఎన్ఆర్సీకి అనుమతించను’ అని సగార్దిఘిలో ఒక బహిరంగ సభలో చెప్పారు.‘మీ పౌరసత్వాన్ని ఎవరూ లాక్కోలేరు. మిమ్మల్ని శరణార్థులుగా మార్చలేరు’ అని బెంగాలీలకు హామీ ఇచ్చారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు: అమిత్ షా జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు యధావిధిగా పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. అస్సాం ఎన్ఆర్సీ ప్రక్రియపై ఆందోళన వాషింగ్టన్: అస్సాంలో రూపొందించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రక్రియపై అమెరికాకు చెందిన కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియతో భారత్‌లో ఏళ్ల తరబడి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న 19 లక్షల మంది పౌరసత్వాన్ని కోల్పోనున్నారని పేర్కొంది. సరైన నియంత్రణ , పారదర్శకత లేకుండా ఎన్ఆర్సీ ప్రక్రియను చేపట్టడం వల్ల అసలు సిసలు భారతీయులకే దేశంలో చోటు లేకుండా ప్రమాదం ముంచుకొస్తోందని తన నివేదికలో పేర్కొంది. అస్సాంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని, వారిని రాష్ట్రం నుంచి పంపించేయడానికే ఎన్ఆర్సీ ప్రక్రియను నిర్వహించారని యూఎస్సీఐఆర్ఎఫ్ కమిషనర్ అనురిమ భార్గవ ఆరోపించారు. -
మోదీ సర్కారుపై అమెరికా 'మతం' బాంబు
న్యూఢిల్లీ: పైకి స్నేహం ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆ దేశాధ్యక్షుడు 'చాయ్ పే చర్చ'ల్లో చిరునవ్వులు చిందించనప్పటికీ ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకున్న వ్యతిరేకతను అమెరికా మరోసారి బాహాటంగా ప్రకటించింది. యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం నేతృత్వంలోని స్వతంత్ర సంస్థ యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్ సీఐఆర్ఎఫ్) తన వార్షిక నివేదికలో మోదీ సర్కారుపై 'మతం' బాంబులు కురిపించింది. సోమవారం విడుదలైన ఈ వార్షిక నివేదికలో సంచలనాత్మక ఆరోపణలు చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ లో అసహనం పెరిగిపోయిందని, మైనారిటీ వర్గాలు భయాందోళనలకు గురవుతున్నాయని యూఎస్ సీఐఆర్ఎఫ్ ఆరోపించింది. 2015 నుంచి ఇండియాలో పరమతసహనం క్షీణిస్తున్నదని, మతస్వేచ్ఛపై నిర్భ్యంతరంగా దాడులు జరుగుతున్నాయన్న నివేదిక.. అధికార బీజేపీ ముఖ్యనేతల అండతో కొందరు బాహాటంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా మైనారిటీలపై దాడులను ప్రోత్సహిస్తున్నట్లు అర్థం చేసుకోవాలని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశంలో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల(జూన్ లో) వాషింగ్టన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ సీఐఆర్ఎఫ్ నివేదిక ఈ రకమైన అంశాలు వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. యూఎస్ సీఐఆర్ఎప్ భారత అంతర్గత వ్యవస్థలపైనా తీవ్ర నిందారోపణలు చేసింది. మైనారిటీలపై దాడులకు పాల్పడేవారిని నిరోధించడంలో పోలీసులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని, అవసరానికి తగ్గ సిబ్బంది న్యాయవ్యవస్థకు లేకపోవడం కూడా అసహనం పెరుగుదలకు మరో కారణమని తెలిపింది. అంతేకాదు.. భారత్ తో ద్వైపాక్షిక చర్చల విషయంలో అమెరికా ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేసింది. భారత్ తో చర్చల్లో మతసహనం అంశాన్ని కూడా చేర్చి, ఆ దేశంలో (ఇండియాలో)ఇప్పుడున్న పరిస్థితిలో మార్పునకు కృషిచేయాలని సలహాఇచ్చింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం (1998) ఆధారంగా ఏర్పాటుచేసిన యూనైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(యూఎస్ సీఐఆర్ఎఫ్) దేశదేశాల్లో మతసహన పరిస్థితులపై అధ్యయనం చేసి, నివేదికలు, సలహాలు ఇస్తుంది. యూఎస్ సీఐఆర్ఎఫ్ అధ్యక్షుడు, సభ్యులను అమెరికా అధ్యక్షుడు, సెనెట్ సభ్యులు ఎంపిక చేస్తారు. పేరుకు స్వతంత్ర సంస్థే అయినప్పటికీ ఇందులో ప్రభుత్వ ఉద్యోగులే పనిచేస్తూఉంటారు. ఫెడరల్ ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుంది.