రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు | BJP leader Krishnasagar Rao comments on harish rao | Sakshi
Sakshi News home page

రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు

Published Sat, May 6 2017 3:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు - Sakshi

రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు

హరీశ్‌పై బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభు త్వంపై మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేస్తు న్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ధ్వజమెత్తారు. హరీశ్‌ చెప్పిన లెక్కలన్నీ తప్పులతడకగా, కేంద్రంపై అసత్య ప్రచారానికి తెర తీసేవిగా ఉన్నాయని శుక్రవారం విమర్శిం చారు. కేంద్రం ఎఫ్‌ఏక్యూ రకం మాత్రమే కొనుగోలు చేయాలని ఎక్కడా చెప్పలేదని, ఈ పేరుతో హరీశ్‌ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేసిన హరీశ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మిర్చి దిగుబడి ఫిబ్రవరి, మార్చికల్లా వస్తుండగా, ఆలస్యంగా మార్చి 30న మార్కెట్‌ ఇంటర్వేన్షన్‌ స్కీం (ఎంఐఎస్‌) కింద ఆదుకోవాలని కేంద్రాన్ని కోరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు రూ.3 వేల బోనస్‌ ప్రకటించాలని, ఎంఐఎస్‌ కింద కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement