టీఆర్‌ఎస్‌కు 10 సీట్లకు మించి రావు | BJP leader krishnasagar comments on TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు 10 సీట్లకు మించి రావు

Published Wed, May 31 2017 3:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

టీఆర్‌ఎస్‌కు 10 సీట్లకు మించి రావు - Sakshi

టీఆర్‌ఎస్‌కు 10 సీట్లకు మించి రావు

బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు
 
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎన్నడూ లేనంతగా బలహీనపడిందని, అందుకే సర్వేల రూపంలో సీఎం కేసీఆర్‌ బలంగా ప్రచారం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. మంగళవారం ఆయన పార్టీ నేత సుధాకరశర్మతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌కు పది సీట్లకు మించి రావని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. విపక్షాలు బోగస్‌ అంటూ సీఎం మాట్లాడుతున్నారని, కాని కేసీఆరే అసలు బోగస్‌ అన్నారు.

కేసీఆర్‌ అసమర్థ పాలన వల్ల అన్ని వ్యవస్థలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయని, మిగులు బడ్జెట్‌ కాస్త లోటు బడ్జెట్‌గా మారిందని ఆరోపించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సీఎంగా కేసీఆర్‌ స్థాయికి తగదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement