
భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలి
తెలంగాణలోనే అతి పెద్ద భూ కుంభకోణం ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఆరోపించారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మియాపూర్ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రమేయం ఉందని ప్రతికల్లో వార్తలు వస్తున్నా యన్నారు. ఈ కుంభకోణంతో కేసీఆర్‌కు సంబంధం లేకపోతే వెంటనే మహమూద్ అలీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో ఒక్క ఐఏఎస్ అధికారిని కూడా ఎందుకు బాధ్యుడిని చేయలేదని నిలదీశారు.