
అపార్ట్‌మెంట్స్‌లో ఏం జరిగింది?
బి.జయ దర్శకత్వంలో ఆర్.జె.సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘వైశాఖం’. హరీశ్, అవంతిక జంటగా నటిస్తున్నారు. విశాఖలో ప్రారంభమైన ఈ చిత్రం నాలుగో షెడ్యూల్ 20వ తేదీ వరకూ జరుగుతుంది. బి.జయ మాట్లాడుతూ - ‘‘సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. అపార్ట్‌మెంట్స్ నేపథ్యంలో వినోదం, భావోద్వేగాలు మేళవించిన కమర్షియల్ కథ. కజక్‌స్థాన్‌లో తీసిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడు తూ - ‘‘జయ దర్శకత్వం వహించిన గత చిత్రాలు విజయం సాధించ డంతో పాటు బయ్యర్లకు లాభాల్ని అందించా యి.
దాంతో ఈ చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్‌లోనూ బిజినెస్ పరంగా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆగస్టులో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ప్రత్యేక పాత్రలో సాయికుమార్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం: డీజే వసంత్.