వినోదాన్ని పంచే అమృతం ఇది
వినోదాన్ని పంచే అమృతం ఇది
Published Mon, Apr 14 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM
‘‘కుటుంబ బంధాలతో సీరియల్స్ చేయడం ఈజీ. వినోదాన్ని మేళవిస్తూ సీరియల్స్ చేయడం కష్టం. అప్పుడప్పుడు ‘అమృతం’ సీరియల్‌ని యూట్యూబ్‌లో చూస్తుంటాను. 313 ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి. గంగరాజుగారే చేసిన ఈ ‘చందమామలో అమృతం’, ‘అమృతం’ సీరియల్ కంటే వినోదాన్ని పంచుతుందని నా నమ్మకం’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చందమామలో అమృతం’. అవసరాల శ్రీనివాస్, హరీశ్, శివన్నారాయణ ఇందులో ముఖ్య పాత్రధారులు. ఊర్మిళ గుణ్ణం నిర్మాత. శ్రీ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించి, తొలి ప్రతిని నాగార్జునకు అందించారు.
గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ -‘‘నేను ‘అమృతం’ సీరియల్ ప్రారంభించినప్పుడు కె.రాఘవేంద్రరావుగారిని పిలిచాను. ‘నీకేమైనా మతిపోయిందా... ఈ రోజు అమావాస్య. ఇప్పుడు ప్రారంభం ఏంటి?’ అన్నారాయన. అయినా.. అమావాస్య రోజే ఆ సీరియల్‌ని ప్రారంభించాను. ఎందుకు ప్రారంభించానో ఈ ‘చందమామలో అమృతం’ సినిమా చూస్తే అర్థమవుతుంది’’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కీరవాణి, సాయి కొర్రపాటి, రమా రాజమౌళి, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సహ నిర్మాత: సందీప్ గుణ్ణం.
Advertisement