అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు | Minister Inauguarations | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు

Published Sun, Jul 24 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

Minister Inauguarations

  •  సికింద్లాపూర్, మల్లారం, అనంతసాగర్, గుర్రాలగొందిలో పర్యటన
  • పలు శంకుస్థాపనలు, ఆవిష్కరణలు, చెక్కుల పంపిణీ

  • చిన్నకోడూరు: రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా సికింద్లాపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, రూ.25 లక్షలతో నిర్మించిన ముదిరాజ్‌ కమ్యూనిటీ హాళ్లను, మల్లారంలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అనంతసాగర్‌లో రూ.13 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, కుర్మ యాదవ సంఘం భవనాలను ప్రారంభించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతసాగర్‌ మాజీ సర్పంచ్‌ జీవ¯ŒSరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుర్రాలగొందిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. వంతెన, బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గుర్రాలగొంది శ్మశాన వాటికలో మొక్కలు నాటారు. అనంతసాగర్, సికింద్లాపూర్‌లో మంత్రి మొక్కలు నాటారు. సికింద్లాపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు బాల్‌రెడ్డి భార్య భాగ్యమ్మకు రూ.6 లక్షల చెక్కును అందజేశారు. మావోయిస్టుల దాడిలో మృతి చెందిన ఇస్తారి భార్య అంబమ్మకు రూ.5 లక్షల చెక్కును, అనంతసాగర్‌లో మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి వెంట ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ నమూండ్ల కమల రామచంద్రం, మార్కెట్‌ కమిటీ  , ఓఎస్‌డీ బాల్‌రాజు, వెటర్నరీ ఏడీ అంజయ్య, సర్పంచ్‌లు మెట్ల శంకర్, ఆంజనేయులు, మేడికాయల వెంకటేశం, ఎంపీటీసీలు ఆంజనేయులు, బాలదుర్గవ్వ, మల్లేశం, ఎంపీడీఓ జాఫర్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఏపీఓ మల్లేశం, ఏపీఎం మహిపాల్, ఈఓపీఆర్డీ సుదర్శ¯ŒS, ఆయా శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement