మీ సాయం మాకొద్దు! | We dont need ur help | Sakshi
Sakshi News home page

మీ సాయం మాకొద్దు!

Published Thu, Apr 20 2017 12:59 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

మీ సాయం మాకొద్దు! - Sakshi

మీ సాయం మాకొద్దు!

పరామర్శించేందుకు వచ్చిన రేవంత్‌కు బాధిత కుటుంబం షాక్‌

సిద్దిపేట రూరల్‌: ‘‘ మీ సాయం మాకొద్దు.. హరీశ్‌ మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటారు’’ అని తమను పరామర్శించేందుకు వచ్చిన టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి, బాధిత కుటుంబం తేల్చి చెప్పింది. దీంతో రేవంత్‌ కంగుతిన్నారు. సీఎం కేసీఆర్‌ సొంతూరైన సిద్దిపేట మండలం చింతమడకలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతు వట్టిపల్లి నాగమణి కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధ వారం రేవంత్‌రెడ్డి వచ్చారు. అయితే, రేవంత్‌ గ్రామంలోకి రావొద్దని స్థానికులు ఊరు బయటే అడ్డుకున్నారు.

మరోవైపు రేవంత్‌ గో బ్యాక్‌ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ని పోలీసులు సీతారాం పల్లి శివారులోనే నిలిపివేశారు. ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతు భర్త పద్మారెడ్డి, పిల్లల్ని కారులో ఎక్కించు కుని రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకొచ్చారు. రేవంత్‌ వారిని పరామర్శించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.50 వేల ఆర్థిక సహాయం అందిం చేందుకు ప్రయత్నించగా.. వారు తీసుకోలేదు. దీంతో రేవంత్‌ వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement