
ఓ కొత్త అనుభూతి
కౌశిక్‌బాబు, హరీశ్, అశ్విని, మిత్ర ప్రధాన తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘తొలి సంధ్య వేళలో’. డి.మోహన్ దీక్షిత్ దర్శకుడు. వై.ఎల్.భాస్కరరాజు నిర్మాత.
కౌశిక్‌బాబు, హరీశ్, అశ్విని, మిత్ర ప్రధాన తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘తొలి సంధ్య వేళలో’. డి.మోహన్ దీక్షిత్ దర్శకుడు. వై.ఎల్.భాస్కరరాజు నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్ర నిర్మాత భాస్కరరాజు కుమార్తె జాగృతి సంస్థ లోగోను ఆవిష్కరించగా, మధురా శ్రీధర్, జె.కె.భారవి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. సినిమా విజయం సాధించాలని వారందరూ ఆకాంక్షించారు. యూనిట్ మొత్తం ఇష్టంగా చేసిన సినిమా ఇదని కౌశిక్‌బాబు అన్నారు. ‘‘ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించే సినిమా ఇది. కడుపుబ్బ నవ్వించే కామెడీతో సాగే ఈ సినిమాలో రావురమేశ్ పాత్ర హైలైట్’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, వచ్చే వారంలో పాటల్ని విడుదల చేస్తామనీ నిర్మాత తెలిపారు.