PSPK28: నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే(సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఉదయం నుంచి అభిమానుల మీద అప్‌డేట్ల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోను పూర్తిగా చూపించకుండా సగం మాత్రమే చూపించారు.
Many More Happy Returns to
— Harish Shankar .S (@harish2you) September 2, 2021
The One and Only.....
@PawanKalyan 🤗🤗🤗🤗🤗#JAATHARA SHURU #Team #PawanKalyan28 @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro pic.twitter.com/fVpG8WlJOz
'జాతర షురూ' అంటూ వదిలిన ఈ పోస్టర్‌లో పవన్ ఓ బైక్ మీద స్టైలిష్‌గా కూర్చున్నట్లు కనిపిస్తోంది. వెనకాల ఇండియా గేట్ ఉండటాన్ని చూస్తుంటే కథ ఢిల్లీ నేపథ్యానికి సంబంధించినదై ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇది పవన్ కెరీర్‌లో 28వ సినిమా. ఇదిలా వుంటే ఈరోజు పవన్ బర్త్‌డే సందర్భంగా భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ రిలీజైంది. హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న రిలీజ్ అవుతున్నట్లు వెల్లడించారు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment