‘డీజే’ సినిమాతో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న దర్శకుడు హరీష్‌శంకర్.. చాలా గ్యాప్ తరువాత మరో రీమేక్‌పై కన్నేశాడు. తమిళ హిట్ సినిమా జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తెరకెక్కిస్తూ.. వరుణ్‌తేజ్‌ను డిఫరెంట్ రోల్‌లో చూపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన వరుణ్ లుక్ వైరల్ కాగ.. తాజాగా ప్రీ టీజర్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు.
‘ఎఫ్2’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత వరుణ్ నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. కాసేపటిక్రితమే ప్రీ టీజర్‌ను రిలీజ్ చేసిన యూనిట్.. సినిమా ఎలా ఉండబోతోందో చిన్న శాంపిల్ వదిలినట్టుంది. వరుణ్ తేజ్ గెటప్‌తోనే తెలుస్తోంది ఎలాంటి పాత్రను పోషిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రీ టీజర్‌తో వరుణ్ తేజ్ పవర్‌ఫుల్ లుక్‌ను రిలీజ్ చేశారు.14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా.. తమిళ హీరో అథర్వ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment