
స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగలు రెండూ ఒకే సారి రావడంతో ఆనందం రెట్టింపైంది. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. టీజర్స్, పోస్టర్స్, కొత్త సాంగ్స్‌తో స్టార్స్ తమ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇదే వరసలో వరుణ్ తేజ్ డిఫరెంట్ రోల్‌ను ట్రై చేస్తూ వస్తోన్న వాల్మీకి చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు.
‘నా సినిమాలో నా విలనే నా హీరో’ అని అథర్వా చెప్పే డైలాగ్.. టీజర్ చివర్లో తెలంగాణ యాసలో వరుణ్ చెప్పే ’అందుకే పెద్దొళ్లు చెప్పిళ్లు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే.. రెండు కాల్చుకోవాలే.. రెండు దాచుకోవాలె’ డైలాగ్ అదిరిపోయాయి. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. పూజాహెగ్డె హీరోయిన్ నటిస్తోన్న మూవీ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment