పుణె : చదువుకోవాలన్న ఆసక్తిగల ఎంతో మంది ప్రతిభావంతులు వివిధ కారణాలతో తమ చదువుకు దూరమవుతున్నారు. అలా తమ చెల్లి భవిష్యత్తు కావొద్దని ఆలోచించిన సోదరులు తన విద్యను కొనసాగించడం కోసం ఓ వినూత్న ఆలోచన చేశారు. వివరాలు.. సింధుదుర్గ్ జిల్లా కంకవ్లి మండలంలోని డారిస్టే గ్రామానికి చెందిన స్వప్నాలి సుతార్ అనే యువతి ఇంటర్‌లో 98 శాతం మార్కులు సాధించింది. భవిష్యత్తులో వెటర్నరీ డాక్టర్ కావాలనుకున్న స్వప్నాలి ప్రస్తుతం ఎంబీబీఎస్‌కు సన్నద్దమవుతోంది. అయితే ఆమె నివసించే ప్రాంతం మారుమూల గ్రామం అయినందున ఇంటర్నెట్ సదుపాయం లేదు. దీంతో తనకు ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతుంది. ఇది చూసి చలించి పోయిన యువతి సోదరులు ఇంటర్నెట్ సిగ్నల్స్ కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పైన ఒక షెడ్ నిర్మించారు. (డిజిటల్ అంతరాలు అధిగమించాలి)
స్వప్నాలి తన కుటుంబం అండతో రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొండమీద ఉన్న షెడ్ వద్దకు వెళ్లి చదువుకుంటోంది. అలాగే ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరవుతోంది. ఇక దీనిని స్థానిక మీడియా ప్రచురించడంతో ఆమెకు సాయం చేసేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. ఓ వ్యక్తి ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్ చేయగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రీట్వీట్ చేశారు. అంతేగాక ఎమ్మెల్యే నితేష్ రాణే.. ఆమె హాస్టల్ ఫీజు రూ .50 వేలు చెల్లించాడు. దీనిపై స్పందించిన పలువురు ‘తన కలల వైపు ప్రయాణించేందుకు అడ్డంకులు ఆపలేవని స్వప్నాలి పట్టుదలతో నిరూపించింది. ఆమెను చూస్తుంటే..మరో రాజ్యాంగాన్ని రాస్తున్నట్లు కనిపిస్తుంది’ అంటూ యువతిని ప్రశంసిస్తున్నారు. (ఆన్‌లైన్ విద్య కష్టంగా ఉంది)
12 తరగతిలో 98% స్కోర్ చేసి సునీత ఇప్పుడు ఎంబిబిఎస్ కోసం సిద్ధమవుతోంది. కానీ ఆమె గ్రామానికి ఆన్‌లైన్ తరగతులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. ఫోన్ లో కూడా ఇంటర్నెట్ సిగ్నల్ రాదు, కాబట్టి ఆమె సోదరులు ఆమె కోసం గ్రామానికి దగ్గరలో ఒక కొండపై ఒక షెడ్ నిర్మించారు 1/2 pic.twitter.com/4CtPQcUvJb
— Naga Kishore (@nagakishore981) August 23, 2020
Comments
Please login to add a commentAdd a comment