మాటల్లేకుండా.. ప్రీ టీజర్‌ | Pre Teaser From Varun Tej Valmiki Movie | Sakshi
Sakshi News home page

మాటల్లేకుండా.. ప్రీ టీజర్‌

Published Sat, Jun 22 2019 11:48 AM | Last Updated on Sat, Jun 22 2019 11:48 AM

Pre Teaser From Varun Tej Valmiki Movie - Sakshi

ప్రమోషన్స్‌ను కొత్తపుంతలు తొక్కిస్తేనే.. సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అవుతుంది. ప్రస్తుతం దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఇలాంటి ట్రిక్కే ఉపయోగిస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో రాబోతోన్న వాల్మీకి చిత్రం నుంచి ఓ మాటల్లేని ప్రీ టీజర్‌ లాంటిది విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తమిళ సూపర్‌హిట్‌ మూవీ జిగర్తాండ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్‌ తేజ్‌ డిఫరెంట్‌ పాత్రను పోషిస్తున్నాడు.

అయితే ఈమధ్య షూటింగ్‌కు వెళ్తున్న వరుణ్‌ తేజ్‌ కారుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయినా నిర్విరామంగా ఎటువంటి అంతరాయం లేకుండా షూటింగ్‌ జరుపుతోంది చిత్రయూనిట్‌. తాజాగా ఈ మూవీ నుంచి ప్రీ టీజర్‌ను జూన్‌ 24న సాయంత్రం 5.18గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే దీంట్లో ఎటువంటి డైలాగ్‌లు ఉండవని.. ఇంకా రావాల్సినవి ఉన్నాయంటూ హరీష్‌ ట్వీట్‌ చేశారు. పూజా హెగ్డే, తమిళ హీరో అథర్వా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్‌ 6న థియేటర్లలో సందడి చేయనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement