
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటూ తెలుగు, తమిళంతో పాటు అటూ బాలీవుడ్‌లోను రకుల్ తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసిన రకుల్ చేతిలో ఇప్పుడు దాదాపు 6 సినిమాలు ఉన్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఈ ఆ సినిమా షూటింగ్స్ వాయిదా పడటంతో ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ముగిసిందని, ప్రస్తుతం ఆమెకు అక్కడ సినిమాలు రావడంలేదని రకుల్ స్వయంగా చెప్పినట్లు ఆ పత్రిక రాసుకొచ్చింది.
దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘నాకు చాలా ఆశ్చర్యం ఉంది. మీరు పెట్టిన హెడ్డింగ్ ప్రకారం టాలీవుడ్‌లో నాకు అవకాశాలు రావడం లేదని నేనేప్పుడు చెప్పాను?. అసలు ఏడాదికి సాధారణంగా ఎన్ని సినిమాలు చేయగలం? 365 రోజుల్లో ఇప్పుడు నేను 6 సినిమాలు చేస్తున్నాను. అంటే ఒక్క ఎడాదికి ఇవి సరిపోవా? అలా అయితే కొత్త ఆఫర్స్ కోసం దయచేసి నా డేట్స్ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే మా టీమ్‌కి సాయం చేయండి’ అంటూ రకుల్ ఆ పత్రికపై అసహనం వ్యక్తం చేసింది.
అది చూసిన డైరెక్టర్ హరీశ్ శంకర్ రకుల్ ట్వీట్‌పై స్పందించాడు. ‘షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నావో నాకు తెలుసు రకుల్.. ఇటీవల నా స్నేహితుడు రాసిన స్క్రిప్ట్ నీకు బాగా నచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్స్ కోసం నీ డేట్స్ సర్దుపాటు చేయడానికి నువ్వు ఎంతగా ప్రయత్నించావో తెలుసు. అది కుదరకపోవడంతో చివరకు ఆ ప్రాజెక్ట్‌ను వాయిదా పడింది. నువ్వు ఇలాగే నీ సినిమాలతో ఇలాంటి వాటికి సమాధాం చెప్పు’ అంటూ రకుల్‌కు శంకర్ మద్దుతునిచ్చాడు.
.. And I know one of my Friends struggled a lot to plan ur dates when u liked their script and
— Harish Shankar .S (@harish2you) June 20, 2021
the project got postponed because of ur busy schedule.
Keep Rocking @Rakulpreet and
Let your work speak !!! https://t.co/GHsVsAO36R
చదవండి:
బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సరిపోదు.. రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
అబ్బాయిని నా దగ్గరకు పంపితే రకుల్ సీక్రెట్స్ అన్నీ చెప్తా :లక్ష్మీ
Comments
Please login to add a commentAdd a comment