మెగా ఆఫర్‌ | Harish Shankar New film with Megastar Chiranjeevi | Sakshi
Sakshi News home page

మెగా ఆఫర్‌

Published Mon, Feb 17 2020 12:16 AM | Last Updated on Mon, Feb 17 2020 5:05 AM

Harish Shankar New film with Megastar Chiranjeevi - Sakshi

చిరంజీవి, హరీష్‌ శంకర్‌

చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం హరీష్‌ శంకర్‌కి వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. త్వరలోనే చిరంజీవి – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్‌. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు హరీష్‌.

ఆ సినిమా స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌తో సినిమా పూర్తయ్యాక చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కిస్తారట హరీష్‌. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఆ తర్వాత ‘లూసీఫర్‌’‡రీమేక్, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌ అయ్యారాయన. మరి.. చిరంజీవి–హరీష్‌ కాంబినేషన్‌ సినిమా ఎప్పుడు? అంటే ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement