రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' సినిమా నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తుంది. సుమారు ఐదేళ్ల తర్వాత రామ్,పూరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
2019లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తుంది. కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. అదేరోజున రవితేజ- హరీష్ శంకర్‌ల సినిమా మిస్టర్ బచ్చన్ విడుదల కానున్నడంతో పోటీ రసవత్తరంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment