ఇస్మార్ట్ (తెలివి)గా ఆలోచించి, ఓ నిర్ణయం తీసుకుంది ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్. ఈ చిత్రం విడుదల తేదీని తెలివిగా నిర్ణయించింది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఆగస్ట్ 15 గురువారం సెలవు. అలాగే సోమవారం రక్షాబంధన్. మధ్యలో శని, ఆదివారాల వీకెండ్ కలిసొస్తుంది.
ఇలా మా ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదలకు ఆగస్ట్ 15 పర్ఫెక్ట్ డేట్’’ అని చిత్రబృందం పేర్కొని, రామ్ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. రామ్–పూరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. పూరి జగన్నా«థ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment