రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే? | Ram Pothineni Double Ismart Teaser Telugu | Sakshi
Sakshi News home page

Double Ismart Teaser: రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్'.. టీజర్‌లో అది మిస్?

Published Wed, May 15 2024 10:29 AM | Last Updated on Wed, May 15 2024 11:18 AM

Ram Pothineni Double Ismart Teaser Telugu

'లైగర్' దెబ్బకు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. 'డబుల్ ఇస్మార్ట్'తో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై  ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు? ఇంతకీ ఎలా ఉంది? హిట్ కొడతారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)

2019లో రిలీజైన 'ఇస్మార్ట్ శంకర్'.. ఊహించిన విధంగా హిట్ అయింది. పూరీ జగన్నాథ్‌కి చాన్నాళ్ల తర్వాత సక్సెస్ రుచి చూపించింది. రామ్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయాడు. కానీ దీని తర్వాత పూరీకి 'లైగర్' రూపంలో ఘోరమైన డిజాస్టర్ ఎదురైంది. రామ్‌ది ఇదే పరిస్థితి. చేసిన సినిమా చేసినట్లే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ చేశారు. అదే 'డబుల్ ఇస్మార్ట్'. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

పూరీ జగన్నాథ్ సినిమాలంటే పంచ్ డైలాగ్స్, మాస్ మూమెంట్స్‌ని ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ఈ టీజర్‪‌లో ఆ రెండూ మిస్ అయ్యాయి. టీజర్ అంతా కూడా పాత్రల పరిచయానికే ఉపయోగించినట్లు కనిపిస్తుంది. 'డబుల్ ఇస్మార్ట్'లో రామ్ తనదైన మేనరిజమ్ చూపించగా.. హీరోయిన్‌గా కావ్య థాపర్ కనిపించింది. అలీకి ఆది మానవుడి తరహా కామెడీ పాత్ర ఇచ్చినట్లు ఉన్నారు. సంజయ్ దత్ గన్స్‌తో కనిపించాడు. రామ్ రెండు డైలాగ్స్ చెప్పాడు గానీ వీటిలో పంచ్ అయితే లేదు. ఎప్పటిలానే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకోగా.. చివర్లో శివ లింగాన్ని చూపించి సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉందని చెప్పకనే చెప్పారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement