
'మెన్ టూ' చిత్రంలో మేం ఎక్కడా మహిళలని తిట్టలేదు. ఈ సినిమా పురుషులకే కాదు.. మహిళలకు కూడా నచ్చుతుంది. ఈ చిత్రం బాగా రావడానికి కారణమైన నిర్మాతలు, మౌర్యలకు థ్యాంక్స్ అని దర్శకుడు శ్రీకాంత్ జి.రెడ్డి అన్నారు. నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం హ్యాష్‌టాగ్ మెన్ టూ.
శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మౌర్య సిద్దవరం మాట్లాడుతూ.. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ఈ సినిమా విడుదలకు కారణమైన మైత్రీ మూవీస్ సంస్థకి థ్యాంక్స్ అన్నారు. మగవాళ్లని ఆడవాళ్లు ఏ విధంగా వేధిస్తారు? అనేది హ్యాష్‌టాగ్ 'మెన్ టూ' చూసి తెలుసుకోవచ్చు అన్నారు నటుడు బ్రహ్మాజీ. చిత్ర సహనిర్మాత శ్రీమాన్, నటీనటులు ప్రియాంక శర్మ, నరేష్, అగస్త్య, కౌశిక్ మాట్లాడారు.