
లెక్క ప్రకారం రామ్ చరణ్ పుట్టినరోజు నాడే 'పెద్ది' సినిమా (Peddi Movie) గ్లింప్స్ రిలీజ్ కావాలి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా తాజాగా శ్రీరామనవమి కానుకగా విడుదల చేశారు. వీడియో బాగుంది. చివరి షాట్ కి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ డేట్ దగ్గరే అసలు సమస్య వచ్చినట్లు అనిపించింది.
(ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)
ఎందుకంటే వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్బంగా మార్చి 27న థియేటర్లలో 'పెద్ది' రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్నిరోజుల క్రితం నాని 'ద ప్యారడైజ్' (The Paradise Movie) చిత్రాన్ని వచ్చే మార్చి 26న విడుదల చేస్తామని పేర్కొన్నాడు. అంటే ఈ రెండు చిత్రాల మధ్య పోటీ కన్ఫర్మ్ అయింది.
ఇక్కడ చరణ్, నాని మధ్య పోటీ కాదు. మరో ఇద్దరి మధ్య కూడా ఉందని చెప్పొచ్చు. చరణ్ (Ram Charan) ఇదివరకే తండ్రి చిరంజీవితో సినిమా నిర్మించారు. నాని కూడా త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాబట్టి పెద్ది మూవీతో పోటీ పడతాడా అంటే సందేహమే అని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా)
ప్యారడైజ్ తీస్తుంది శ్రీకాంత్ ఓదెల కాగా.. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు. వీళ్లిద్దరూ కూడా సుకుమార్ శిష్యులే. ఒకవేళ పోటీ కచ్చితం అయితే మాత్రం సుక్క శిష్యుల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
మరోవైపు ప్యారడైజ్ కి అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా.. పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కోలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా పోటీనే అనుకోవచ్చు. ఇలా ఒక్కరు కాదు ఈ రెండు చిత్రాల వల్ల ఏకంగా తలో ముగ్గురు మధ్య పోటీ అనుకోవచ్చేమో. మరి ఈ రెండింటిలో ఏది చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారనేది కూడా చూడాలి.
(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్)