ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? కానీ అదే టెన్షన్ | Sakshi
Sakshi News home page

Kalki Movie Release Date: కొత్త రిలీజ్ డేట్.. అటు ప్లస్ ఇటు మైనస్?

Published Sat, Apr 27 2024 10:55 AM

Prabhas Kalki 2898 AD Release Date New

డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. లెక్క ప్రకారమైతే మే 9న థియేటర్లలో రిలీజ్ కావాలి. వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థకు అచ్చొచ్చిన తేదీ ఇది. కానీ ఓ వైపు గ్రాఫిక్స్ పనులు ఆలస్యం, మరోవైపు ఏపీలో ఎన్నికల హడావుడి వల్ల తప్పని పరిస్థితిల్లో వాయిదా వేశారు. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఏమై ఉంటుందా అని అభిమానుల మధ్య డిస్కషన్. సరిగ్గా ఇలాంటి టైంలో కొత్త రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ 'కల్కి' రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేశారు? సంగతేంటి?

'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ రిలీజ్ విషయంలో వాయిదాలు పడుతూనే ఉన్నాయి. 'కల్కి' కూడా ఇందులో మినహాయింపు కాదు.మే 9న పక్కాగా వస్తామని నిర్మాతలు ఫిక్సయ్యారు. కానీ పలు కారణాల వల్ల మార్చుకోక తప్పలేదు. జూన్, జూలై అని రెండు ఆప్షన్స్ అనుకున్నారు. ఫైనల్‌గా జూన్ 27న రావాలని అందరూ ఫిక్సయ్యారట. శనివారం సాయంత్రం కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయం చెప్పబోతున్నారట. మరోవైపు ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో కూడా జూన్ 27నే రిలీజ్ అవుతుందన్నట్లు చూపించేస్తుంది.

జూన్ 27న 'కల్కి' రిలీజ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్లస్సులతో పాటు మైనస్సులు కూడా ఉన్నాయి. ప్లస్సుల విషయానికొస్తే.. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరైన మూవీ పడటం లేదు. 'కల్కి'పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంటే వసూళ్లు మోత గ్యారంటీ. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ ఇమేజ్ కూడా 'కల్కి'కి ప్లస్ అవుతుంది. మైనస్సుల విషయానికొస్తే.. జూన్ చివర్లో పండగలు, సెలవులు అంటూ ప్రత్యేకంగా లేవు. స్కూల్, కాలేజీలు అప్పటికే తెరిచేస్తారు. దీని వల్ల కలెక్షన్లపై కొంతమేర ఎఫెక్ట్ ఉండొచ్చు. కమల్ 'ఇండియన్ 2' కూడా ఇదే నెలలో రిలీజ్ ఉండొచ్చు. ఇదే జరిగితే సౌత్‌లో 'కల్కి' వసూళ్లు కాస్త తగ్గే ఛాన్సులు ఉంటాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Advertisement
Advertisement