
సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రల్లో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 2న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే కొంచెం ముందే ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు హీరో విజయ్ దేవరకొండ ద్వారా ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ‘‘ట్రాక్టర్ లా పోస్తాం డీజిల్.. విజయ్ అన్న ఒచ్చిండు కొట్టుర్రా విజిల్’ అంట టీమ్ చెప్పగా, ‘వర్షం పడుతోంది చమ్ చమ్ చమ్... మే 26న మేమ్ ఫేమస్‌కి అందరూ కమ్ కమ్ కమ్’ అంటూ విజయ్ దేవరకొండ తనదైన స్టైల్‌లో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment