
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీస్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇప్పటికే ఇలా ఎన్నో సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపాయి. ఇప్పుడు అదే బాటలో మరో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ మరువ తరమా రాబోతుంది. అద్వైత్ ధనుంజయ,అవంతిక నల్వా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా నిర్మించారు.
ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.