పుష్ప-2 మూవీ వాయిదా.. కోర్టులో కేసు వేస్తానంటోన్న నెటిజన్! | Allu Arjun Pushpa 2 Release Delayed, Fans Files A Case To This Heart Broken News | Sakshi
Sakshi News home page

Pushpa 2 Release Delay: పుష్ప-2 వాయిదా.. మా ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు!

Published Tue, Jun 18 2024 5:06 PM

Allu Arjun Pushpa 2 Release delayed Fans Files A case To This heart broken News

బన్నీ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. ఈ సినిమాను సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్‌-1కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎర్రచందనం సిండికేట్‌ నేపథ్యంలో రూపొందించిన పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో పుష్ప-2 పై కూడా అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

అయితే దాదాపు నాలుగు నెలల ముందే పుష్ప-2 రిలీజ్‌ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని సుకుమార్‌ పలుసార్లు కుండబద్దలు కొట్టారు. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ కూడా ఖుషీ అయ్యారు. మరో రెండు నెలల్లో రిలీజ్‌ కావాల్సినా పుష్ప-2 ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా మేకర్స్‌ ప్రకటించారు. డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమాన హీరో మూవీ వాయిదా పడడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ట్వీట్‌కు ఓ నెటిజన్‌ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొత్త రిలీజ్‌ డేట్ పోస్టర్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

ట్వీటిర్‌లో నెటిజన్ రాస్తూ.. 'పుష్ప-2 సినిమా జూన్ 2024లో విడుదల కావాల్సిన సినిమా. అసలు డిసెంబర్ 2024కి ఎందుకు మార్చారు. ఇదంతా పుష్ప మేకర్స్‌కు జోక్‌లా ఉందా? మీరు ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. తక్షణమే పుష్ప-2 విడుదల చేయాలని కమ్యూనిటీ తరపున  కోర్టులో కేసు వేస్తా'అంటూ ఐకాన్ స్టార్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.  మరో నెటిజన్ రాస్తూ.. 'ఇది మంచి పద్ధతి కాదు.. ఇంకా ఎన్నిసార్లు డేట్‌ మారుస్తారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మూవీ రిలీజ్ డేట్ మారడంతో బన్నీ ఫ్యాన్స్‌ సైతం మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement