post pone
-
పుష్ప-2 మూవీ వాయిదా.. కోర్టులో కేసు వేస్తానంటోన్న నెటిజన్!
బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. ఈ సినిమాను సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో రూపొందించిన పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో పుష్ప-2 పై కూడా అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.అయితే దాదాపు నాలుగు నెలల ముందే పుష్ప-2 రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని సుకుమార్ పలుసార్లు కుండబద్దలు కొట్టారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు. మరో రెండు నెలల్లో రిలీజ్ కావాల్సినా పుష్ప-2 ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమాన హీరో మూవీ వాయిదా పడడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ట్వీట్‌కు ఓ నెటిజన్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్లో రాసుకొచ్చాడు.ట్వీటిర్లో నెటిజన్ రాస్తూ.. 'పుష్ప-2 సినిమా జూన్ 2024లో విడుదల కావాల్సిన సినిమా. అసలు డిసెంబర్ 2024కి ఎందుకు మార్చారు. ఇదంతా పుష్ప మేకర్స్‌కు జోక్‌లా ఉందా? మీరు ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. తక్షణమే పుష్ప-2 విడుదల చేయాలని కమ్యూనిటీ తరపున కోర్టులో కేసు వేస్తా'అంటూ ఐకాన్ స్టార్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరో నెటిజన్ రాస్తూ.. 'ఇది మంచి పద్ధతి కాదు.. ఇంకా ఎన్నిసార్లు డేట్ మారుస్తారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మూవీ రిలీజ్ డేట్ మారడంతో బన్నీ ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు.oh godwhy you reschedule yr?😓How many times you are rescheduling #Pushpa2TheRulethis is unfair— Puneet (@iampuneet_07) June 17, 2024The movie was releasing in June 2024. Why this has been shifted to Dec 2024. Is this a joke to the filmmakers. Playing with the emotions of audience.On behalf of Puspha Community i will file a case in Court to release it ASAP— GlobalGlimpses✨ (@krunchi_hu) June 17, 2024 -
డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు షాక్
బెంగళూరు: శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు శనివారం బెయిల్ మీద బయటకు వస్తామని భావిస్తుండగా.. వారి ఆశ కాస్త నిరాశ అయ్యింది. వీరికి సంబంధించిన బెయిల్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా అది కాస్తా సెప్టెంబర్ 21 కి వాయిదా పడింది. సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) అధికారులు తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని కనుక బెయిల్ పిటిషన్ విచారణని వాయిదా వేయాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు బెంగళూరులోని ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) ప్రత్యేక కోర్టు రాగిణి, సంజనా బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే సోమవారానికి(సెప్టెంబర్ 21) వాయిదా వేసింది. రాగిణి, సంజనలు ఇద్దరికి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని.. వారు పార్టీలలో మాదకద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లకు, పెడ్లర్లకు మధ్య జరిగిన మెసేజ్‌లను కూడా రిమాండ్ కాపీలో పొందు పర్చారు అధికారులు. (చదవండి: డ్రగ్స్‌కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు?) డ్రగ్స్ రాకెట్ కేసుకు సంబంధించి సీసీబీ రాగిణి ద్వివేదిని సెప్టెంబర్ 4 న అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 8 న సంజన గల్రానిని అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పరపన అగ్రహార జైలులో ప్రత్యేక సెల్లో ఉన్నారు. శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి ఇప్పటికే 10 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల సెలబ్రిటీ జంట ఐంద్రితా రే, దిగంత్‌లను సీసీబీ విచారణకు పిలిచింది. ఒక రోజు ప్రశ్నించమే కాక వారి గాడ్జెట్లను స్వాధీనం చేసుకుని తరువాత పంపించింది. ఈ రోజు నటులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు యువరాజ్‌లను సీసీబీ విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. -
ఏప్రిల్ 14న ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ
సాక్షి, తాడేపల్లి: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వివరించారు. లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకొని వారికి ఇళ్ల సైట్లను చూపించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఉగాది రోజున ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నా, కరోనా వైరస్ ప్రమాదం నివారణ చర్యల్లో భాగంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. చదవండి: భయాన్ని కాదు.. ధైర్యాన్ని నింపండి -
పౌరసత్వ చట్టంపై ఈయూలో ఓటింగ్ వాయిదా
లండన్: మోదీ సర్కార్ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంట్లో చర్చకు రంగం సిద్ధమైంది. యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు సీఏఏపై చర్చ కోరుతూ దాఖలు చేసిన ఐదు తీర్మానాలను కలిపి ఒకటిగా చేసి, బ్రసెల్స్‌లో జరుగుతున్న ప్లీనరీలో ప్రవేశపెట్టారు. ఈ అంశాన్ని బుధవారం సమావేశాల తుది ఎజెండాలో చేర్చారు. చర్చ అనంతరం గురువారం జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేశారు. ఓటింగ్ మార్చి నెలలో జరిగే సమావేశాల్లో నిర్వహిస్తామని యూరోపియన్ పార్లమెంట్ ప్రకటించింది. సీఏఏపై చర్చను మాత్రం ఇప్పుడు కొనసాగించి, ఓటింగ్‌ను మార్చికి వాయిదా వేయాలన్న సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. భారత్ వ్యతిరేకత కారణంగానే ఓటింగ్ వాయిదా పడిందని, ఇది భారత ప్రభుత్వ దౌత్య విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరోపియన్ పార్లమెంట్ తీరును భారత్ తీవ్రంగా గర్హించింది. ఒక రాజ్యాంగబద్ధసంస్థ చేసిన చట్టంపై మరో రాజ్యాంగబద్ధ సంస్థ తీర్పునివ్వడం సరికాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడికి లేఖ రాశారు. యూరోపియన్ పార్లమెంట్లో పాకిస్తాన్ మిత్రుల వాదనపై భారత మిత్రుల వాదనే నెగ్గిందని భారత ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. సీఏఏ వివక్షాపూరితమని, ఆ చట్టంలోని వివాదాస్పద సవరణలను భారత్ వెనక్కు తీసుకోవాలని గత నెలలో ఐరాస మానవహక్కుల విభాగం ‘యూఎన్‌హెచ్‌సీఆర్’ చేసిన వ్యాఖ్యను ఈయూ పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుంది. బెగ్జిట్కు ఆమోదం యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బుధవారం యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అమెరికాలో.. సీఏఏ, ఎన్నార్సీలు అమెరికా ప్రతినిధులసభలో మరోమారు చర్చనీయాంశంగా మారాయి. సీఏఏ, ఎన్నార్సీలు మతపరమైన హింసకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు విచారణ సందర్భంగా సభకు వివరించారు. అంతర్జాతీయ మానవహక్కుల ఉపసంఘాలూ, గ్లోబల్ హెల్త్ ఉపసంఘాలూ, సివిల్ రైట్స్, సివిల్ లిబర్టీస్‌సబ్ కమిటీలూ, ఆఫ్రికా విదేశాంగ వ్యవహారాల కమిటీలు ఈ విచారణను చేపట్టాయి. -
లాలూపై తీర్పు నేటికి వాయిదా!
రాంచీ: దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. లాలూకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరుతూ ఆయన సన్నిహితులు పలువురు తనకు ఫోన్లు చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివపాల్ సింగ్ గురువారం వెల్లడించారు. తాను చట్టప్రకారమే తీర్పు ఇస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లాలూ, శివపాల్‌ల మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది. తాను ఉంటున్న బిర్సాముండా జైలులో చలి అధికంగా ఉందని లాలూ జడ్జీకి ఫిర్యాదు చేయగా.. న్యాయమూర్తి స్పందిస్తూ ‘అయితే తబలా వాయించండి’ అని వ్యంగ్యంగా జవాబిచ్చారు. అనంతరం లాలూ కోర్టులో సరిగ్గా ప్రవర్తించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా.. ‘నేను కూడా న్యాయవాదినే’ అని లాలూ ప్రతిస్పందించారు. -
ఓయూపై కక్షగట్టిన సీఎం కేసీఆర్ : కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోసం పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నాడని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ..జనవరి 3 నుంచి 7 దాకా జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ప్రధానమంత్రి హాజరుకావడం ఆనవాయితీ అని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఈ సమావేశాలను వాయిదా వేశారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, నోబెల్ బహుమతులు పొందిన వారు ఏడుగురు ఈ సమావేశాలకు హాజరు అవుతామని నమోదు చేసుకున్నారని చెప్పారు. విమాన ప్రయాణపు టికెట్లు, హోటళ్లు, కార్లు వంటివన్నీ బుక్ చేసుకున్నారని, వీటికోసం కోట్లాది రూపాయలు ఖర్చు కూడా చేశారని అన్నారు. ఏకపక్షంగా రద్దుచేయడం ద్వారా ఓయూ ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ, ప్రధాని రాష్ట్రానికి రావడం ఇష్ఠం లేనందుకే సీఎం కేసీఆర్‌కు ఇష్ఠంలేదని ఆరోపించారు. ఇది తెలంగాణకు అవమానమన్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. లక్ష్యం లేకుండానే తెలుగు మహా సభలు సొంత డబ్బాకోసం నిర్వహించారని, రాచరిక పాలనకు తెలుగు మహాసభ వేదిక అయిందని ఆరోపించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటించారా, తెలుగు భాషాభివృద్ధికి ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని ప్రశ్నించారు. తెలుగు మహాసభలు టీఆర్ఎస్ మహాసభల్లా జరిగాయన్నారు. మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయను అవమానించే విధంగా వేదిక మీదకు ఆహ్వానించకుండా, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేదిక మీదకు పిలిచారని అన్నారు. ఇవేమి తెలుగుసభలో అర్థం కావడంలేదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కవులు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. -
మరణాన్నీ వాయిదా వెయ్యొచ్చు!
లండన్: నిండు నూరేళ్లు చల్లగా జీవించమని పెద్దలు అప్పుడప్పుడూ దీవిస్తూ ఉంటారు. దీవెన వరకూ బాగానే ఉన్నా నూరేళ్లూ జీవించడం అనేది ఈ రోజుల్లో సాధ్యమయ్యేది కాదు. ప్రస్తుతమున్న కాలుష్య పూరిత వాతావరణంలో అరవయ్యేళ్లు బతికితే గొప్పే. అయితే తాజాగా ఓ పరిశోధన వృద్ధాప్యాన్ని దగ్గరకు చేరనివ్వకుండా నివారించవచ్చని నిరూపించింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం చర్మ కేన్సర్ చికిత్సలో భాగంగా వాడే ట్రామెటినిబ్ ఔషధాన్ని వృద్ధాప్యాన్ని దూరం చేసేందుకూ ఉపయోగించవచ్చు. తద్వారా మరణాన్ని వాయిదా వేయొచ్చు. పరిశోధకులు తమ ప్రయోగంలో భాగంగా పూలపై వాలే ఈగలను ఎంచుకున్నారు. వీటిలోకి ట్రామెటినిబ్ డ్రగ్‌ను ప్రవేశపెట్టారు. ఇవి సాధారణ ఈగలతో పోల్చితే 12 శాతం ఎక్కువ కాలం జీవించాయి. ‘‘ఈగలతో పాటు జంతువులు, మానవుల్లో ఉండే ఆర్ఏఎస్ ప్రొటీన్ మార్గాన్ని మందగించేట్టు చేయడం ద్వారా వయసును మరింత పెంచుకోవచ్చు. ఈ డ్రగ్ ఆర్ఏఎస్ మార్గాన్ని ప్రభావితం చేయగలదు’’ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. రాబోయే 10-20 ఏళ్లలో పూర్తిస్థాయి చికిత్సావిధానాలు అందుబాటులోకి రాగలవని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు.