సేనాపతి రాక అప్పుడే...!  | Kamal Haasan Indian 2 announces release date with a new poster | Sakshi
Sakshi News home page

సేనాపతి రాక అప్పుడే...! 

Published Sun, Apr 7 2024 1:32 AM | Last Updated on Sun, Apr 7 2024 1:32 AM

Kamal Haasan Indian 2 announces release date with a new poster - Sakshi

జూన్‌లో థియేటర్స్‌కు రానున్నాడు భారతీయుడు. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’). ఈ సినిమాలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్‌హాసన్‌. 1996లో విడుదలైన ఈ సినిమాకు పాతికేళ్ల తర్వాత ‘ఇండియన్‌ 2’, ‘ఇండియన్‌ 3’ సీక్వెల్స్‌ను రూపొందించారు హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌.

ఈ రెండు చిత్రాల చిత్రీకరణ పూర్తయింది. ‘ఇండియన్‌ 2’ సినిమాను జూన్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ శనివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘సేనాపతి మళ్లీ వస్తున్నాడు. జూన్‌లో ‘ఇండియన్‌ 2’ సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది’’ అని ‘ఎక్స్‌’లో ఈ సినిమా కొత్త పోస్టర్‌ను షేర్‌ చేశారు కమల్‌హాసన్‌. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుభాస్కరన్, ఉధయనిధి స్టాలిన్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 14న విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్‌ సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరకర్త.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement