Jr NTR Playing Negative Role In Hrithik Roshan's War 2 Movie - Sakshi
Sakshi News home page

మరోసారి విలన్‌గా ఎన్టీఆర్‌.. ఏ సినిమాలో అంటే..

May 19 2023 7:38 AM | Updated on May 19 2023 9:46 AM

Jr NTR Play Negative Role In War 2 Movie - Sakshi

ఎన్టీఆర్‌లో నెగటివ్‌ యాంగిల్‌ ఎలా ఉంటుందో చూపించిన చిత్రం ‘జై లవ కుశ’. ఆ చిత్రంలో ‘జై’ పాత్రలో విలన్‌గా విజృంభించారు ఎన్టీఆర్‌. పాజిటివ్‌ షేడ్స్‌ ఉన్న లవ, కుశలో హీరోయిజం చూపించారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్‌ నెగటివ్‌ షేడ్‌ ఉన్న రోల్‌లో కనిపించనున్నారని టాక్‌. అది కూడా హిందీ తెరపై. బాలీవుడ్‌ యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ స్పై ఫ్రాంచైజీలోని ‘వార్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

(చదవండి: నాన్న చనిపోయాక అప్పు తీర్చలేక ఆస్తులమ్మేశాం: శివ బాలాజీ )

హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రధారులుగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రకు కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని, అలాగే ఆయన పాత్ర నెగటివ్‌గా ఎందుకు మారుతుంది? అనేదానికి ఓ బలమైన కారణం ఉండేలా అయాన్‌ ముఖర్జీ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఈ చిత్రంలో కథానాయికల పాత్రల కోసం దీపికా పదుకోన్, శర్వరీ వాఘ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి.

(చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్న డైరెక్టర్‌, అప్పటి క్షణాలను తలుచుకుంటూ.. )

అత్యంత భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్‌ షూటింగ్‌ను ఆరంభించాలని అనుకుంటున్నారట. ఇక ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement