వార్‌ 2 కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ కసరత్తులు.. అర్థం చేసుకోరే? | Jr NTR Gets Angry on Paparazzi, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Jr NTR: వార్‌ 2 కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ కసరత్తులు.. అది లీక్‌ చేయొద్దనే..

Published Fri, Apr 26 2024 12:05 PM | Last Updated on Fri, Apr 26 2024 12:07 PM

Jr NTR Gets Angry on Paparazzi, Video Goes Viral

తారక్‌.. తనను ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని గమనించి ఓయ్‌.. అంటూ ఆగ్రహించాడు. ఈ మేరకు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వార్‌ 2 లుక్‌ సీక్రెట్‌

టాలీవుడ్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. అటు కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాతో పాటు ఇటు బాలీవుడ్‌లో అయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో వార్‌ 2లో నటిస్తున్నారు. ఈ యాక్షన్‌ మూవీ కోసం తారక్‌ తరచూ ముంబై వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో తాజా షెడ్యూల్‌ కోసం మరోసారి ముంబై వెళ్లారు. హీరోను చూడగానే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. ఆయన స్టార్‌ హోటల్‌లో బస చేసేందుకు వెళ్తుంటే వెంబడించి వీడియో తీశారు.

ఓయ్‌..
ఆ సమయంలో ఫోన్‌ మాట్లాడుతున్న తారక్‌.. తనను ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని గమనించి ఓయ్‌.. అని పిలుస్తూ తనను క్లిక్‌మనిపించొద్దని అభ్యర్థించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా తారక్‌ ఎంతో సరదాగా ఉంటారు. ఆయనకు అంత ఈజీగా కోపమనేది రాదు. సినిమా కోసం ఆయన ఎంత హార్డ్‌ వర్క్‌ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వార్‌ 2 కోసం కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారు. తన మేకోవర్‌ను సైతం మార్చేశారు. ఇది అర్థం చేసుకోలేని కొందరు ఆయన అనుమతి కూడా తీసుకోకుండా తనను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో అలా చేయొద్దని తారక్‌ సదరు కెమెరామన్లను వారించారు. తన లుక్‌ లీక్‌ కావొద్దని ఆయన ఇంతలా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది.

వార్‌ 2 కోసం
కాగా వార్‌ 2 కోసం హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ 60 రోజులపాటు కాల్షీట్లు కేటాయించారు. తొలి భాగాన్ని మించిపోయేలా హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్‌ సీన్లు ప్లాన్‌ చేస్తున్నారట! ఈ పోరాట సన్నివేశాలను ‘కెప్టెన్‌ అమెరికా: ది సివిల్‌ వార్‌’, ‘కెప్టెన్‌ అమెరికా: ది ఫస్ట్‌ సోల్జర్‌’ ‘ఫాస్ట్‌ ఎక్స్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు యాక్షన్‌ డిజైన్‌ చేసిన స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ స్పిరో రజాటోస్‌ డిజైన్‌ చేసినట్లు భోగట్టా! ‘వార్‌ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది.

 

 

చదవండి: బాలీవుడ్‌ ఎంట్రీ.. కీర్తి చూశారా? అప్పుడే ఎలా మారిపోయిందో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement