War-2 Movie: హృతిక్‌ రోషన్‌- ఎన్టీఆర్‌ వార్‌-2 రిలీజ్‌ ప్రకటన వచ్చేసింది | Hrithik Roshan And Jr NTR War-2 Movie Release Date Confirmed, Here's What We Know - Sakshi
Sakshi News home page

War 2 Movie Release Date: హృతిక్‌ రోషన్‌- ఎన్టీఆర్‌ వార్‌-2 రిలీజ్‌ ప్రకటన వచ్చేసింది

Published Wed, Nov 29 2023 2:49 PM | Last Updated on Wed, Nov 29 2023 3:45 PM

Hrithik Roshan And Jr NTR War-2 Movie Release On 2025 August 14th - Sakshi

హృతిక్‌ రోషన్‌ , టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'వార్‌'.   2019లో విడుదలైన ఈ స్పై థ్రిల్లర్‌ సినిమా భారీ హిట్‌ కొట్టింది.   బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'వార్‌2' వస్తుంది.  'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఎన్టీఆర్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.  భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ అఫీషియ‌ల్‌గా ప్రకటించింది.

ఇండిపెండెన్స్ డే కానుక‌గా 2025 ఆగ‌ష్టు 14న వార్ 2 విడుదల అవుతుందని ప్రకటించారు. య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్స్‌లో వ‌స్తోన్న ఆరో సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం ఉంది. హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. 2024 జనవరి నుంచి వార్ 2 సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొన‌నున్న‌ట్లు తెలిసింది.  ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు తెలిసింది.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. కొరటాల శివ డైరెక్ట్‌ చేస్తున్నాడు. 2024 ఏప్రిల్‌ 5న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆపై వెంటనే ప్రశాంత్‌ నీల్‌తో తారక్‌ సినిమా ప్రారంభించాల్సి ఉంది. 2025 ఆగష్టులో వార్‌-2 ఉండటంతో పాన్‌ ఇండియాలో తారక్‌ క్రేజీ భారీగా పెరగడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement