Jr NTR Joins Hrithik Roshan, Tiger Shroff's War 2 - Sakshi
Sakshi News home page

హృతిక్‌ రోషన్‌తో ఎన్టీఆర్‌ యుద్ధం.. ఇది కదా అసలైన మల్టీస్టారర్!

Published Wed, Apr 5 2023 12:31 PM | Last Updated on Wed, Apr 5 2023 12:56 PM

Jr NTR Joins Hrithik Roshan In war 2 - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్‌ చరణ్‌ గ్లోబల్‌ స్టార్స్‌గా మారారు. ప్రస్తుతం ఈ స్టార్‌ హీరోలిద్దరు తమ తదుపరి చిత్రాలపై ఫోకస్‌ పెట్టారు. రామ్‌ చరణ్‌ ఆర్‌సీ 15 షూటింగ్‌తో బిజీగా ఉంటే.. తారక్‌ ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ‘NTR30’ ప్రారంభించారు. రీసెంట్‌గా సెట్‌లోకి కూడా అడుగుపెట్టాడు. ఇలా వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్న తారక్‌.. ఇప్పుడు పెద్ద యుద్దమే ప్రకటించారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి ‘వార్‌’ చేయబోతున్నాడు. 

హృతిక్‌ రోషన్‌ హీరోగా, టైగర్‌ ష్రాఫ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘వార్‌’. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అప్పుడే ఈ సినిమా సీక్వెల్‌ని రూపొందిస్తామని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ ప్రకటించింది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్ గా వార్ 2కి స్టేజి ఇప్పుడు సెట్ అయ్యింది. అయితే ‘వార్‌’ చిత్రానికి సిద్ధార్థ్‌  ఆనంద్‌ దర్శకత్వం వహిస్తే... ‘వార్‌ 2’కు మాత్రం అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఈ సీక్వెల్‌లో హృతిక్‌ రోషన్‌తో కలిసి యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడని బాలీవుడ్‌ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ న్యూస్‌ అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌ని కూడా షేక్‌ చేస్తోంది. 

వార్ 2’ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నట్లు ని​న్న వార్తలు వినిపంచాయి. ఇప్పుడు  జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్త బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ కాంబో ఖరారై చాలా రోజులే అయినట్టుంది. ‘బ్రహ్మాస్త్ర’ విడుదల సమయంలో ఆ సినిమా తెలుగు ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అప్పటికే వార్‌ 2లో నటించడానికి ఎన్టీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement