
ముంబై: వెస్టిండీస్‌తో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 38 వ్యక్తిగత పరుగుల వద్ద తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కీమో పాల్ బౌలింగ్‌లో అనవసరపు షాట్ కోసం యత్నించిన శిఖర్ ధావన్ క్యాచ్ రూపంలో ఔటయ్యాడు. అయితే ధావన్ ఔటైన తర్వాత కీమో పాల్ తొడగొట్టడం అభిమానులతో పాటు ధావన్‌కు కూడా నవ్వులు తెప్పించింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఫాస్ట్ బౌలర్ కీమో పాల్ వేసిన ఐదో బంతిని మిడ్‌వికెట్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు.
కానీ.. షాట్ అతను ఆశించిన విధంగా బ్యాట్‌కి కనెక్ట్ కాకపోవడంతో.. నేరుగా బంతి వెళ్లి కీరన్ పావెల్ చేతుల్లో పడింది. కాగా, ధావన్ తరహాలో తొడగొడుతూ బౌలర్ కీమో పాల్ సంబరాలు చేసుకున్నాడు. ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ పట్టిన తర్వాత ధావన్ తొడగొడుతూ సంబరాలు చేసుకోవడం అందరి సుపరిచితమే. కీమో పాల్ తనని కవ్విస్తూ తొడగొట్టినా.. ధావన్ మాత్రం నవ్వుతూ పెవిలియన్‌కి వెళ్లిపోయాడు. దాంతో భారత్ తొలి వికెట్‌ను 71 పరుగుల వద్ద కోల్పోయింది.
— This is HUGE! (@ghanta_10) 29 October 2018