బాబర్ అజమ్, విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ అధిగమించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో బాబర్ 58 బంతుల్లో 78 పరుగులు సాధించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఈ ఓపెనర్.. అత్యంత వేగంగా ఈ ఘనతనందుకున్న క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. (చదవండి: సిరీస్ అందించాడు.. ర్యాంకు కొట్టేశాడు)
భారత సారథి కోహ్లి 27 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకుంటే.. బాబర్ 26 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించి అతని రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ 47 పరుగులతో విజయం సాధించి 3-0తో కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బాబర్ తన ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించిన కోహ్లి.. తాజా టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి తిరిగి బరిలోకి దిగనున్నాడు. (చదవండి: పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్!)
Comments
Please login to add a commentAdd a comment