న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫామ్ గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని, ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ లయ అందుకుంటాడని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప‍్రాయపడ్డాడు. గత ఇంగ్లండ్ పర్యటనతో పాటు వెస్టిండీస్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లోనూ ధోని బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా, ఆదివారం నుంచి వెస్టిండిస్‌తో ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరిస్‌ల నుంచి ధోనిని సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ.. ‘అవును.. ఇప్పుడు టీ20 జట్టులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఉన్నారు. వాళ్లు గత కొద్దిరోజులుగా బాగానే ఆడుతున్నారు. కానీ.. వారు ఎప్పటికీ ధోనితో సరితూగలేరు. ఇంకా చెప్పాలంటే కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేరు. మ్యాచ్‌లో ధోని వికెట్ కీపింగే బాధ్యతలే కాదు. చాహల్, కుల్దీప్, బుమ్రా లాంటి బౌలర్లకి సలహాలు, సూచనలు చేస్తుంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లికి వెలకట్టలేని సాయం చేస్తున్నాడు’ అని ఆశిష్ నెహ్రా అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment