ముంబై: వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో సెంచరీ సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడిపై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. అంబటి రాయుడు ఒక తెలివైన బ్యాట్స్‌మన్ అని కోహ్లి కొనియాడాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లి.. అతనికి తమ మద్దతు అవసరమని పేర్కొన్నాడు. ప్రధానంగా నాల్గో స్థానంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయుడి బ్యాటింగ్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ చాలా సంతోషంగా ఉందన్నాడు. ‘ వచ్చిన అవకాశాన్ని రాయుడు రెండు చేతులతో ఒడిసి పట్టుకున‍్నాడు. అతనికి మేము(జట్టు మేనేజ్‌మెంట్) అండగా ఉంటుంది. 2019 వరల్డ్‌కప్ వరకూ సాధ్యమైనన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని అతనికి కల్పిస్తాం. రాయుడు గేమ్‌ను అర్ధం చేసుకునే తీరు నిజంగా అమోఘం. నాల్గో స్థానంలో అతను బ్యాటింగ్ చేసిన విధానంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం’ అని కోహ్లి పేర్కొన్నాడు.
మరొకవైపు యువ పేసర్ ఖలీల్ అహ్మద్‌లో కూడా అసాధారణ టాలెంట్ ఉందంటూ కొనియాడాడు. పిచ్ సహకరించిన ప్రతీసారి ఖలీల్ ప్రతిభ బయటపడుతూనే ఉందన్నాడు. రెండు వైపులకు బంతిని స్వింగ్ చేసే సత్తా ఖలీల్ అహ్మద్‌లో ఉందన్నాడు. కచ్చితమైన ఏరియాల్లో బంతిని సంధిస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్న ఖలీల్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ 224 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(162)కు జతగా అంబటి రాయుడు(100) శతకంతో మెరిశాడు.
కోహ్లి సూపర్ ఫీల్డింగ్ చూశారా?
Comments
Please login to add a commentAdd a comment