ఎంఎస్ ధోని
ముంబై : టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో తన మెరుపు కీపింగ్‌తో ఔరా అనిపించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విండీస్ బ్యాట్స్‌మన్ కీమోపాల్ ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్సవ్వడంతో ధోనికి దొరికిపోయాడు. రెప్పాపాటులో పనిపూర్తి చేసిన ధోని.. స్టంపౌట్‌లో కొత్త రికార్డు నమోదు చేశాడు. ఈ స్టంపౌట్‌ను ధోని 0.08 సెకన్లలోనే పూర్తి చేయడం గమనార్హం. తొలుత నాటౌట్‌గా భావించిన జడేజా ధోని చిరునవ్వులను చూసిన బ్యాట్స్‌మన్ కథ ముగిసింధని గ్రహించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. (చదవండి: కోహ్లి సూపర్ ఫీల్డింగ్ చూశారా?)
ఇక మూడో వన్డేలో అద్భుత క్యాచ్ వావ్ అనిపించిన ధోని తాజా స్టంపింగ్‌తో తన కీపింగ్‌లో పసతగ్గలేదని నిరూపించాడు. ఈ స్టంపౌట్‌పై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 0.08 సెకన్లలో స్టంపౌట్ చేసి తన రికార్డు (0.09)ను తిరగరాశాడని ఒకరంటే.. కీపింగ్‌లో ధోనిని మించినోడే లేడని మరొకరు కామెంట్ చేశారు. ఇక 2019 ప్రపంచకప్ లోపు ధోనిని పక్కకు పెట్టే ఆలోచనను మానేయాలని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్, తెలుగు తేజం అంబటి రాయుడుల శతకాలతో భారత్ 224 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. (చదవండి: వారెవ్వా ధోని.. ఏం క్యాచ్)
Lightening stumping..💪@msdhoni
— TamilCRIC (@tamil_cric) October 29, 2018
0.08 sec 😍 #MSDhoni #IndvsWi pic.twitter.com/oqk7eaX4Xt
MS dhoni is great wicketkeeper of the world Cricket ...run vi banege world cup 2019 me aur tum sab aalochna karna band karo
— Vijay# Toppo (@VijayToppo17) October 29, 2018
Comments
Please login to add a commentAdd a comment