
తిరువనంతపురం: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనతకు చేరువయ్యాడు. భారత్ తరపున వన్డే ఫార్మాట్‌లో పది వేల పరుగుల మార్కును చేరేందుకు ధోని పరుగు దూరంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నాల్గో వన్డేలో 15 బంతుల్లో 23 పరుగులు చేసిన ధోని.. మరో పరుగు సాధిస్తే టీమిండియా తరపున పది వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఇప్పటివరకూ ధోని వన్డే ఫార్మాట్‌లో చేసిన పరుగులు 10, 173 కాగా, భారత్ ఆటగాడిగా మాత్రం ఆ ఘనతను చేరుకోలేదు.
2007లో ఆఫ్రికా ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసియా ఎలెవన్ తరపున ఆడిన ధోని ఆ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 174 పరుగులు సాధించాడు. దాంతో భారత్ తరపున పదివేల పరుగులు పూర్తి చేసేందుకు పరుగు దూరంలో నిలిచాడు ధోని. తిరువనంతపురంలో గురువారం జరుగనున్న చివరిదైన ఆఖరి వన్డేలో ధోని ఆ మార్కును చేరుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment