సచిన్, ధోని (ఫైల్ ఫొటో)
ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని టీ20ల నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై సెలక్షన్ కమిటీ ఛీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలు ధోని టీ20 కెరీర్ ముగియలేదని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే తాజాగా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ అంశంపై స్పందించాడు. టీమ్‌మేనేజ్ మెంట్ మైండ్‌సెట్ ఎంటో అర్థం కావడం లేదన్నాడు. ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘సెలక్టర్ల ఆలోచనేంటో అర్థం కావడం లేదు. డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో తనకు తెలియదు కానీ, ఏ వ్యూహం, నిర్ణయాలు తీసుకున్న దేశానికి ఉపయోగపడేలా ఉండాలి.’ అని స్పష్టం చేశాడు. దేశానికి ధోని చేసిన సేవలను సచిన్ ఈ సందర్భంగా కొనియాడాడు. ‘ఏం జరగబోతుంది.. ఏ చేయాలనే’ విషయం ఈ మాజీ కెప్టెన్ తెలుసని అభిప్రాయపడ్డాడు. (చదవండి: ధోని చితక్కొడితే ఎట్టా ఉంటాదో తెలుసా!)
‘నేనెప్పుడు ఏ విషయంలోను ఎలాంటి తీర్పులివ్వలేదు. ప్రస్తుత సెలక్టర్ల నిర్ణయంపై కూడా తీర్పునివ్వను. అన్ని ఫార్మాట్‌లో ధోని అద్భుతంగా రాణించాడు. చాలా ఏళ్లుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తు వచ్చాడు. చాలా ఏళ్లుగా ఆడుతున్న ఆటగాళ్లకు ఏం జరగబోతుంది, ఏం చేయాలనే విషయం తెలుసుంటుంది. ఈ పరిస్థితుల్లో నేనైతే.. ఏం చేయాలో మొదలు తెలుసుకుంటాను. డ్రెస్సింగ్ రూంలో సహచర ఆటగాళ్లతో చర్చిస్తాను. కోచ్, కెప్టెన్ ఏం ఆశిసస్తున్నారో తెలుసుకుంటాను. ప్రస్తుతానికి ధోని చాలా రోజులు క్రికెట్ ఆడుతాడని నమ్ముతున్నాను.’ అని సచిన్ పేర్కొన్నాడు. ఇక ధోనిని వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ల నుంచి పక్కన పెట్టిన విషయం తెలిసిందే. సెలక్టర్లు మాత్రం ధోనికి విశ్రాంతి ఇచ్చామని, ప్రత్యామ్నయ వికెట్ కీపర్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అభిమానులు మాత్రం ధోనిని తొలిగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ధోని భాయ్ అది పక్కా ఔట్! )
Comments
Please login to add a commentAdd a comment