చెన్నై: వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా పొట్టి ఫార్మాట్‌లో తన విజయాల సంఖ్యను భారత్ మరింత పెంచుకుంది. ఈ క్రమంలోనే టీ20 విజయాల శాతంలో పాకిస్తాన్‌ను వెనక్కునెట్టిన భారత్ రెండో అత్యుత్తమ జట్టుగా నిలిచింది. గత పుష్కరకాలం నుంచి చూస్తే భారత్ ఇప్పటివరకూ 107 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 68 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. మరో 36 మ్యాచ్‌ల్లో ఓటమి చూడగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
దాంతో టీమిండియా విజయాల శాతం 65.23గా నమోదైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ను అధిగమించింది టీమిండియా. విండీస్‌తో చెన్నై మ్యాచ్‌లో విజయం తర్వాత పాక్‌ను వెనక్కునెట్టింది భారత జట్టు. టీ20ల్లో పాక్ విజయాల శాతం 65.10గా ఉండగా, దాన్ని టీమిండియా బ్రేక్ చేసింది. గత కొంతకాలంగా టీ20ల్లో పాకిస్తాన్ తిరుగులేని జట్టుగా ఎదిగిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే ఆ జట్టు ప్రస్తుతం నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతోంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా సాధిస్తున్న విజయాలు టీమిండియాలో నిలకడను చాటిచెబుతున్నాయి. అంతర్జాతీయ 20ల్లో విజయాల శాతంలో అఫ్గానిస్తాన్ టాప్ ప్లేస్‌లో ఉంది. అఫ్గానిస్తాన్ టీ20లు ఆడటం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ చూస్తే విజయాల శాతం 67.24గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment