
ముంబై : వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ భారీ స్కోర్‌ను సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 377 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 137 బంతుల్లో 162 పరుగులతో మెరుపు సెంచరీ సాధించగా.. తెలుగు తేజం అంబటి రాయుడు (100) సెంచరీతో కదంతొక్కాడు. గత మూడు వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలతో చలరేగిన కెప్టెన్ కోహ్లి (16) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు.
భారత్ బ్యాట్సమెన్స్‌లో ధావన్ (38) కోహ్లి (16), ధోని (23), జాదవ్ (16) నాటౌట్ జడేజా (6) నాటౌట్ రాణించారు. విండీస్ బౌలర్లలో రోచ్ రెండు, ఆశ్లే నర్స్, కీమో పాల్ తలో ఒక వికెట్ పడగొట్టారు. కాగా విండీస్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
Comments
Please login to add a commentAdd a comment