చెన్నై: చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. అఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో విండీస్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని చేధించిన భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్ సేన ఈ మ్యాచ్ విజయంతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ధాటిగా ఆడింది. బ్రేవో(43 నాటౌట్), పూరన్ (53 నాటౌట్)లు చేలరేగడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్‌లో 13 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ పాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా17 పరుగులు చేసి థామస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి ధావన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో భారత్ పంత్(38 బంతుల్లో 58 పరుగులు), ధావన్(62 బంతుల్లో 92 పరుగులు) వికెట్లు కోల్పోయినప్పటికీ.. చివరి బంతి వరకు సాగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment