
లక్నో: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు సోమవారం సాయంత్రమే మ్యాచ్ జరగాల్సిన స్టేడియం పేరును మార్చేశారు. లక‍్నోలో కొత్తగా నిర్మితమైన ఇకానా అంతర్జాతీయ స్టేడియం పేరును దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరుమీదుగా ‘భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ అంతర్జాతీయ స్టేడియం’గా మార్చేశారు.
స్టేడియం పేరు మార్పుపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు చేస్తోంది. యోగి ప్రభుత్వం సొంతంగా ప్రజలకు ఏమీ చేయడం లేదని ఎస్పీ అధికార ప్రతినిధి సునిల్ సింగ్ ఆరోపించారు. ప్రజల కోసం ఏం చేయకుండా ప్రదేశాలు, నగరాల పేర్లు మారుస్తూ ఉన్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment