‘ఖలీల్‌ అహ్మద్‌ ఒక భరోసా’ | Khaleel Ahmed An Exciting Prospect, Says Bharat Arun | Sakshi
Sakshi News home page

‘ఖలీల్‌ అహ్మద్‌ ఒక భరోసా’

Published Thu, Nov 1 2018 12:54 PM | Last Updated on Thu, Nov 1 2018 3:18 PM

Khaleel Ahmed An Exciting Prospect, Says Bharat Arun - Sakshi

తిరువనంతపురం: టీమిండియా యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌పై బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో భారత్‌కు ఒక భరోసా నింపుతాడనే నమ్మకం తమకుందని కొనియాడాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో మూడు వికెట్లు సాధించడమే కాకుండా పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఖలీల్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు.  ఎడమచేతి వాటం బౌలర్‌ కావడం కూడా అతనికి కలిసొస్తుందన్నాడు.

'ఖలీల్ భవిష్యత్‌లో మంచి ప్లేయర్‌గా మారతాడు. అతను చాలా చురుకు, నైపుణ్యం బాగున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. భారత్‌ పేస్‌ బౌలింగ్‌ విభాగానికి ఖలీల్‌ ఒక భరోసా అవుతాడనే నమ్మకం ఉంది’ అని భరత్‌ అరుణ్‌ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement